విజయవాడలో పోలింగ్ కలకలం: బ్యాలెట్ పేపర్ లో గుర్తులు తారుమారు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: విజయవాడ

విజయవాడ నగరంలోని 55వ డివిజన్ లో బ్యాలెట్ పేపర్ లో అభ్యర్థుల ఎన్నికల గుర్తులు తారుమారైనట్లు అధికారులు తెలిపారు. ఓల్డ్ రాజరాజేశ్వరిపేటలో వైఎస్సార్సీపీ అభ్యర్థి పేరు ఎదురుగా కాంగ్రెస్ గుర్తు, కాంగ్రెస్ అభ్యర్థి పేరు ఎదురుగా ఫ్యాన్ గుర్తు ముద్రించారన్నారు. ఈ పొరపాటుపై అభ్యర్థి రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేయడంతో తక్షణమే స్పందించిన సిబ్బంది పోలింగ్ను నిలిపివేశారని, కొత్త బ్యాలెట్లు ముద్రించిన తర్వాత ఓటింగ్ పునఃప్రారంభం కానుందని అధికారులు వెల్లడించారు.