తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో వైమానిక సర్వే చేపట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు

రిపోర్టర్: మహేష్ స్థలం: Andhra Pradesh

అర్నబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేడు పర్యటించినట్లు సీఎంవో ఆంధ్రప్రదేశ్ వెల్లడించింది. కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ ప్రాంతాల్లో నష్టపోయిన వరిచేలు, అరటి, కొబ్బరి తోటలు, ఆక్వా చెరువులను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. నిమ్మకూరు, పామర్రు, బంటుమిల్లి, నరసాపురం తదితర ప్రాంతాల్లో పంట నష్టాన్ని అంచనా వేసేందుకు అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేశారు.