హైదరాబాద్ లో ఘనంగా కిషోర్ మూవీ మేకర్స్ తొలి చిత్రం పూజా కార్యక్రమాలు

రిపోర్టర్: రాజేష్ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో కిషోర్ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాత ఎన్.ఎన్. కిషోర్ నిర్మిస్తున్న తొలి చిత్రం పూజా కార్యక్రమాలతో బుధవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ వేడుకకు దర్శకులు వి.వి. వినాయక్, హీరో ఆది సాయికుమార్ ముఖ్య అతిథులుగా విచ్చేసి చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపినట్లు చిత్ర బృందం పేర్కొంది.