వీధి వ్యాపారుల కోసం ఈ నెలంతా లోక్ కల్యాణ్ మేళాలు
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: విజయనగరం
విజయనగరం జిల్లాలో వీధి వ్యాపారుల ఆర్థిక భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం లోక్ కల్యాణ్ మేళాలు నిర్వహిస్తోంది. ఈ నెల 30 వరకు ఈ మేళాలు కొనసాగుతాయి. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో చిరు వ్యాపారులను గుర్తించి సంక్షేమ పథకాలు, రుణాలు అందిస్తున్నారు. ఆసక్తి గల వ్యాపారులకు రూ.30 వేల పరిమితితో క్రెడిట్ కార్డులు మంజూరు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.