ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైన విశాఖ యువ క్రికెటర్ షబ్నం

రిపోర్టర్: మహేష్ స్థలం: విశాఖపట్నం

తండ్రి కలను నిజం చేసేందుకు మైదానంలో అడుగుపెట్టిన విశాఖ యువ క్రికెటర్ షబ్నం అద్భుత ప్రతిభతో భారత అండర్-19 జట్టులో చోటు దక్కించుకుంది. కఠిన సాధనతో అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు ఆస్ట్రేలియాలో జరిగే మూడు ఫార్మాట్లలో సత్తా చాటేందుకు ఇండియా-ఏ జట్టుకు ఎంపికైంది. చిన్న వయసులోనే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లోనూ మెరిసిన షబ్నం ప్రస్థానం ఎంతో స్పూర్తిదాయకంగా నిలిచిందని క్రీడా వర్గాలు వెల్లడించాయి.