నాతవరం మండల ప్రజాప్రతినిధుల పదవీకాలం ముగింపు ఘన వీడ్కోలు
రిపోర్టర్: రుత్తల నాగేశ్వరరావు
స్థలం: నాథవరం
నాతవరం మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు సాగిన లక్ష్మణమూర్తి మరియు మండల ఎంపీటీసీల పదవీకాలం ముగిసిన సందర్భంగా మండల కార్యాలయంలో వీడ్కోలు, సత్కార కార్యక్రమం నిర్వహించారు. ఎంపీడీఓ ఎం. సత్య శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఐదేళ్ల అభివృద్ధిని గుర్తుచేసుకుంటూ ప్రజాప్రతినిధులను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు.