జనగామ భూ వివాదంలో ఏఐ ఉత్తర్వులు: హైకోర్టు తీవ్ర అసంతృప్తి
రిపోర్టర్: అశోక్
స్థలం: జనగామ
జనగామ జిల్లా దేవరుప్పుల మండలం పెద్దమడూరు గ్రామానికి చెందిన మెడిపల్లి కొమురయ్య భూ వివాదంలో కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వులు కలకలం రేపాయి. క్షేత్రస్థాయి వాస్తవాలు పరిశీలించకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాలతో ఉత్తర్వులు రూపొందించారని పిటిషనర్ తరఫు న్యాయవాది హైకోర్టులో ఆరోపించారు. అధికారుల తీరుపై జస్టిస్ ఎన్.వి. శ్రవణ్ కుమార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆ ఉత్తర్వుల అమలుపై మధ్యంతర స్టే విధించారని, తదుపరి విచారణ నిమిత్తం అధికారులకు నోటీసులు జారీ చేశారని న్యాయవాదులు తెలిపారు.