అర్నబ్ తుపాను ముప్పు: రైతులు తక్షణ జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ వర్సిటీ సూచన
రిపోర్టర్: సురేష్
స్థలం: అమరావతి
అర్నబ్ తుపాను ముప్పు నేపథ్యంలో రాష్ట్రంలో ఖరీఫ్ సాగును కాపాడుకునేందుకు రైతులు వెంటనే తక్షణ జాగ్రత్తలు తీసుకోవాలని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇన్ఛార్జి వైస్ ఛాన్స్లర్ ఆచార్య పీవీ సత్యనారాయణ సూచించారు. కోతకు సిద్ధంగా ఉన్న వరి, పత్తి, మొక్కజొన్న పంటలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆయన పేర్కొన్నారు. పొలాల్లో వర్షపు నీరు నిల్వకుండా మురుగు కాలువలను శుభ్రం చేయాలని, తద్వారా నష్ట తీవ్రతను గణనీయంగా తగ్గించవచ్చని ఆయన స్పష్టం చేశారు.