ఆసియా క్రీడల నుండి జ్యోతి యర్రాజి తప్పుకోవడంతో పతక ఆశలకు గండి

రిపోర్టర్: శివ స్థలం: న్యూఢిల్లీ

ఆసియా క్రీడల మహిళల వంద మీటర్ల హర్డిల్స్ పోటీకి చివరి నిమిషంలో భారత అథ్లెట్ జ్యోతి యర్రాజి దూరమైనట్లు అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఉన్నతాధికారి తెలిపారు. వార్మప్ సమయంలో మోకాలి నొప్పితో బాధపడిన ఆమె, పోటీలలో పాల్గొనలేకపోయినట్లు వెల్లడించారు. గతంలో శస్త్రచికిత్స చేయించుకున్న ఆమె, ఈ పోటీల ద్వారా పునరాగమనం చేయాల్సి ఉండగా, ఈ పరిణామం భారత పతక ఆశలకు గట్టి ఎదురుదెబ్బ తగిలిందని క్రీడా వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.