'ఓటీటీలోకి రామ్ అండ్ లీల': సెప్టెంబర్ 18న ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్
రిపోర్టర్: కృష్ణ
స్థలం: India
తమిళంలో రియో రాజ్, వర్తిక జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ సైన్స్ ఫిక్షన్ చిత్రం 'రామ్ అండ్ లీల' డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. రామచంద్రన్ కన్నన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 21న థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. రొమాన్స్, ఫ్యామిలీ హ్యూమర్ తో పాటు ఒక విభిన్నమైన సైన్స్ ఫిక్షన్ ట్విస్ట్ ఉన్న ఈ చిత్రం సెప్టెంబర్ 18 నుండి ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.