ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలుదారులకు టాటా మోటార్స్ భారీ ఊరట

రిపోర్టర్: భాస్కర్ స్థలం: తెలంగాణ

ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని మరింత పెంచే లక్ష్యంతో ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ తన విప్లవాత్మక బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ ప్రోగ్రామ్ను పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ కార్ల శ్రేణికి విస్తరించినట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ నూతన విధానం ద్వారా వాహనం ధరతో పాటు బ్యాటరీ ఖర్చును వేరు చేసి తక్కువ ధరకే కార్లను అందిస్తున్నామని పేర్కొన్నారు. దీనివల్ల టియాగో ఈవీ కేవలం నాలుగు లక్షల పైచిలుకు ధరకే అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు.