జూలూరుపాడులో యువతి అనుమానాస్పద మృతితో కలకలం

రిపోర్టర్: bhukya Narasimha rao స్థలం: జులూరుపాడు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామంలో ఇంద్రపల్లి హరిణి అనే పద్దెనిమిదేళ్ల యువతి ఇంట్లో బాత్రూమ్ పక్కన అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. ఆమె మృతదేహంపై గాయాలు ఉండటంతో స్థానికంగా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని సమగ్ర దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.