ఉక్రెయిన్ రష్యా దేశాలపై సైబర్ దాడులు: హెచ్చరిక వ్యవస్థలు ధ్వంసం

రిపోర్టర్: రాజేష్ స్థలం: కీవ్ / మాస్కో

ఉక్రెయిన్ మరియు రష్యా దేశాల అత్యవసర హెచ్చరిక వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని భారీ సైబర్ దాడులు జరిగినట్లు ఆయా దేశాల అధికారులు వెల్లడించారు. మొబైల్ ఫోన్లకు రసాయన మరియు రేడియేషన్ ముప్పు ఉందని ఉక్రెయిన్ వ్యాప్తంగా నకిలీ హెచ్చరికలు ప్రసారమైనట్లు ఉక్రెయిన్ వైమానిక దళం స్పష్టం చేసింది. మరోవైపు తమ ప్రభుత్వ మొబైల్ అప్లికేషన్ పై కూడా సైబర్ దాడి జరిగిందని రష్యా పేర్కొన్నట్లు తెలిపారు.