కిడ్నీ వ్యాధిగ్రస్తులకు హెచ్చరిక: ఇన్ఫ్లూయెన్జా ముప్పుపై వైద్య నిపుణుల కీలక సూచన
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: చెన్నై
దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధులతో బాధపడేవారికి ఇన్ఫ్లూయెన్జా ఇన్ఫెక్షన్ల ముప్పు తీవ్రంగా ఉంటుందని మద్రాస్ మెడికల్ మిషన్ హాస్పిటల్ ప్రొఫెసర్ డాక్టర్ జార్జి అబ్రహం వెల్లడించారు. కిడ్నీ బాధితులు రోగ నిరోధక శక్తి తగ్గి తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో వైద్యుల సలహా మేరకు ఇన్ఫ్లూయెన్జా టీకాలు వేయించుకోవడం ఎంతో ముఖ్యమని, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు.