ముఖ్యమంత్రి చంద్రబాబు సభా ప్రాంగణం సమీపంలో పేలిన సిలిండర్

రిపోర్టర్: వెంకట్ స్థలం: అమరావతి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణానికి సమీపంలో సోడా గ్యాస్ సిలిండర్ పేలడం తీవ్ర కలకలం రేపింది అని పోలీసులు తెలిపారు. ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. పేలుడు ధాటికి సిలిండర్ సుమారు అరవై మీటర్ల దూరం ఎగిరి విద్యుత్ తీగలపై పడటంతో సరఫరా నిలిచిపోయింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.