బెల్లంపల్లిలో తెలంగాణ ఉద్యమకారుల అక్రమ అరెస్టులతో భగ్గుమన్న శ్రేణులు
రిపోర్టర్: ramesh chitty
స్థలం: బెల్లంపల్లి
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో తెలంగాణ ఉద్యమకారులను గురువారం తెల్లవారుజామున పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ లో నిర్బంధించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు. ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ, ప్రభుత్వాన్ని పసులేటి వెంకటేష్ తీవ్రంగా మండిపడ్డారు.