కలబురగిలో సిద్దరామయ్య విగ్రహాన్ని తొలగించిన మున్సిపల్ అధికారులు

రిపోర్టర్: రాము స్థలం: కలబురగి

కర్ణాటకలోని కలబురగిలో హైకోర్టు రోడ్డు జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య తొమ్మిది అడుగుల విగ్రహాన్ని మున్సిపల్ అధికారులు పోలీసుల సమక్షంలో తొలగించారు. కళ్యాణ కర్ణాటక ఉత్సవాల వేళ ఎలాంటి అనుమతులు లేకుండా అభిమానులు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో అధికారులు ఈ చర్యలు చేపట్టారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పర్యటన సందర్భంగా జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.