ట్విట్టర్ టిల్లు అంటూ కేటీఆర్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్
రిపోర్టర్: రాజేష్
స్థలం: హైదరాబాద్
తనను బౌన్సర్ అని సంబోధించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేటీఆర్‌ది మేనేజ్మెంట్ కోటా అయితే తనది మెరిట్ కోటా అని ఆయన స్పష్టం చేశారు. తండ్రి పేరు చెప్పుకుని రాజకీయాల్లోకి వచ్చిన కేటీఆర్ తనను విమర్శించడం హాస్యాస్పదమని, లాఠీదెబ్బలు తిని ఎదిగిన తమను బౌన్సర్ అనడం తగదని బండి సంజయ్ మండిపడ్డారు.