అరకు కాఫీతోనే నా దినచర్య: ఏపీని గ్లోబల్ హబ్గా మారుస్తామన్న చంద్రబాబు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: అమరావతి

అరకు కాఫీతోనే తన దైనందిన జీవితం ప్రారంభమవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అంతర్జాతీయ కాఫీ దినోత్సవం సందర్భంగా రాష్ట్రానికి గర్వకారణమైన అరకు కాఫీ విశిష్టతను ఆయన కొనియాడారు. అరకును ప్రపంచ స్థాయి ప్రీమియర్ కాఫీ గమ్యస్థానంగా మార్చడానికి తాము చురుగ్గా పనిచేస్తున్నామని పేర్కొన్నారు. దీని ద్వారా రైతులకు సాధికారత కల్పిస్తూ, ప్రపంచ కాఫీ మ్యాప్లో ఆంధ్రప్రదేశ్కు తగిన స్థానం దక్కేలా చూస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.