భువనేశ్వర్లో గన్ పాయింట్తో యువతిపై గుర్తుతెలియని వ్యక్తి అఘాయిత్యం

రిపోర్టర్: రాము స్థలం: Bhubaneswar

భువనేశ్వర్లో అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన ముఖానికి ముసుగు వేసుకున్న దుండగుడు గన్ పాయింట్తో తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఇరవై ఆరు ఏళ్ల యువతి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు డీసీపీ శ్రావణ్ వివేక్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశామని, కీలక ఆధారాలు లభించాయని, త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని స్పష్టం చేశారు. ఆ సమయంలో బాధితురాలి సోదరి ఇంట్లో లేదని పోలీసులు వెల్లడించారు.