పులివెందులలో మాజీ సీఎం వైఎస్ జగన్ పై పోలీసుల కేసు నమోదు

రిపోర్టర్: శివ స్థలం: పులివెందుల

పులివెందుల మున్సిపల్ కార్యాలయం వద్ద ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి ధర్నా నిర్వహించినందుకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పై పోలీసులు కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. పోలింగ్ రోజున ఆయన చేపట్టిన ఈ ఆందోళన రాజకీయంగా తీవ్ర కలకలం రేపింది. ఈ పరిణామంపై వైసీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగానే ఈ చర్యలు తీసుకున్నట్లు అధికార వర్గాలు స్పష్టం చేశాయి.