పహల్గామ్ ఉగ్రదాడిలో భర్తను కోల్పోయిన ఐశన్య ద్వివేది తీవ్ర ఆవేదన
రిపోర్టర్: నరేష్
స్థలం: ఉజ్జయిని
జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో తన భర్త శుభమ్ ద్వివేదిని కోల్పోయిన ఐశన్య ద్వివేది తన పుట్టినరోజు సందర్భంగా ఉజ్జయినిలోని మహాకాళేశ్వర ఆలయాన్ని సందర్శించి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ 2025 ఏప్రిల్ 22 నాటి విషాద ఘటన తన జీవితంలో అంధకారం నింపిందని, దేవుడిపై తనకు ఎంతో కోపం ఉండేదని, ఇప్పటికీ తన ప్రశ్నలకు సమాధానాలు దొరకలేదని ఆమె కన్నీటిపర్యంతమయ్యారు.