తమిళ సినిమాలపైనే పూర్తి దృష్టి పెట్టిన యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: హైదరాబాద్
టాలీవుడ్లో వరుస పరాజయాలతో వెనుకబడిన యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ తన కెరీర్ను గాడిలో పెట్టేందుకు సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె సక్సెస్ అంటే కేవలం లెక్కలేనన్ని సినిమాలు చేయడం కాదని, తనలోని ప్రతిభను నిరూపించుకోవడమే నిజమైన విజయమని తెలిపింది. సౌత్ ఇండస్ట్రీలో పవర్ఫుల్ రోల్స్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నానని, తన పూర్తి దృష్టిని తమిళ సినిమాలపైనే పెట్టినట్లు వెల్లడించింది.