తెలంగాణలో అకస్మాత్తుగా పెరిగిన ఎండలు వర్షాలపై వాతావరణ శాఖ ప్రకటన

రిపోర్టర్: సురేష్ స్థలం: హైదరాబాద్

తెలంగాణ రాష్ట్రంలో గత రెండు రోజులుగా ఎండల తీవ్రత ఒక్కసారిగా పెరిగిందని, సాధారణం కంటే ఎక్కువగా 35 డిగ్రీల సెల్సియస్కు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గరిష్ఠంగా 37.2 డిగ్రీల రికార్డు స్థాయి ఉష్ణోగ్రత నమోదైందని తెలిపారు. అయితే అక్టోబర్ 4 మరియు 5 తేదీల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.