నర్సంపేట ఆర్టీసీ బస్సు నిచ్చెనపై ప్రమాదకర ప్రయాణం వైరల్

రిపోర్టర్: శేఖర్ స్థలం: నర్సంపేట

నర్సంపేట ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు వెనుక నిచ్చెనపై ఓ ప్రయాణికుడు అత్యంత ప్రమాదకరంగా ప్రయాణిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బస్సులో రద్దీ కారణంగానే ఇలా బయట వేలాడాల్సి వచ్చిందా అని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహాలక్ష్మి పథకం అమలుతో బస్సుల్లో రద్దీ పెరిగిందని, దీనివల్ల ప్రయాణికుల భద్రత ప్రమాదంలో పడుతోందని నెటిజన్లు పేర్కొంటున్నారు. వెంటనే ఆర్టీసీ అధికారులు స్పందించి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.