చర్లపల్లి జైలులో ప్రణయ్ హత్య కేసు నిందితుడు మృతి

రిపోర్టర్: రమేష్ స్థలం: సికింద్రాబాద్

సంచలనాత్మక మిర్యాలగూడ అమృత-ప్రణయ్ పరువు హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఏ-4 నిందితుడు అబ్దుల్ బారీ చర్లపల్లి జైలులో గుండెపోటుతో మృతి చెందాడు. తీవ్ర అస్వస్థతకు గురికావడంతో జైలు అధికారులు సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బారీ ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై గాంధీ ఆస్పత్రి ఫోరెన్సిక్ విభాగం హెచ్‌ఓడీ ప్రొఫెసర్‌ డాక్టర్ నాగమోహన్ రావు మాట్లాడారు.