గ్రాడ్యుయేట్ ఓటు నమోదు తప్పనిసరి: ప్రజాస్వామ్య పటిష్టతకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపు

రిపోర్టర్: BHARADWAJ స్థలం: మునగాల

మునగాల మండల పరిధిలో వరంగల్ ఖమ్మం నల్లగొండ గ్రాడ్యుయేట్స్ ఓటు నమోదు పత్రాలను ఎమ్మార్వో కార్యాలయంలో ఉపాధ్యాయుడు వక్కంతల భరత్ బాబు సమర్పించారు. నవంబర్ ఆరు లోపు అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కొత్త ఓటర్ జాబితా కోసం ప్రతి గ్రాడ్యుయేట్ ఫారం పద్దెనిమిది నింపాలని తెలిపారు. ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా సరైన నాయకులను ఎన్నుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.