బెంగళూరులో భారీ సైబర్ మోసం: పెరుగు ప్యాకెట్ రిఫండ్ పేరుతో మహిళకు షాక్

రిపోర్టర్: వెంకట్ స్థలం: Bengaluru

బెంగళూరులోని వసంతనగర్ ప్రాంతానికి చెందిన యాభై ఆరు సంవత్సరాల గృహిణి సైబర్ మోసానికి గురై మ్మిది వేల రూపాయలు కోల్పోయినట్లు సెంట్రల్ సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. ఆన్లైన్లో పెరుగు ప్యాకెట్ ఆర్డర్ చేయగా అది దెబ్బతిని రావడంతో, రిఫండ్ కోసం కస్టమర్ కేర్ నంబర్ను వెతికి మోసగాళ్లను సంప్రదించానని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వెల్లడించారు. సైబర్ నేరగాళ్లు పంపిన వాట్సాప్ లింక్ ద్వారా డిజిటల్ యాప్ను ఓపెన్ చేయగానే ఆమె ఖాతా నుంచి డబ్బులు మాయమయ్యాయి.