కిర్లంపూడిలో జేసి అపూర్వ భరత్ ఆకస్మిక తనిఖీలు: రేషన్ దుకాణాల పరిశీలన
రిపోర్టర్: U.Srinivasarao
స్థలం: కిర్లంపూడి
కాకినాడ జిల్లా కిర్లంపూడిలో సోమవారం జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కొత్తపేటలో రేషన్ దుకాణంలో ఏర్పాటు చేసిన మీ మార్ట్ను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. సరుకుల వివరాలను ప్రజలకు స్పష్టంగా కనిపించేలా డిస్ప్లే చేయాలని అధికారులను ఆదేశించారు. రైతు సేవా కేంద్రంలో ధాన్యం కొనుగోలు తీరును ఆరా తీసి, జగపతినగరంలో ఎఫ్సీ గోడౌన్ రికార్డులను పరిశీలించారు.