తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమంటూ ఎంపీ ధర్మపురి అరవింద్ సవాల్

రిపోర్టర్: గోపి స్థలం: జగిత్యాల

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, మూడింట రెండు వంతుల మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ధీమా వ్యక్తం చేశారు. జగిత్యాలలో పర్యటించిన ఆయన, మోతే చెరువు సుందరీకరణ పనులు ప్రారంభించకపోవడంపై అధికారులను నిలదీశారు. అభివృద్ధి పనులు చేయకుండా శంకుస్థాపనలు ఎందుకు చేశారని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ను ప్రశ్నించారు. రాష్ట్రంలో తమకు ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని స్పష్టం చేశారు.