మద్యానికి బదులుగా శానిటైజర్ల వినియోగం: కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ

రిపోర్టర్: నరేష్ స్థలం: ఆంధ్రప్రదేశ్

ఇథనాల్ ఆధారిత హ్యాండ్‌ శానిటైజర్లను కొందరు మద్యానికి బదులుగా తాగుతుండటంపై రాష్ట్ర డ్రగ్స్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు, కొవిడ్‌ సమయంలో శానిటైజర్ల విక్రయాలకు ఇచ్చిన లైసెన్స్‌ మినహాయింపును ఉపసంహరించాలని కోరుతూ కేంద్రానికి డీజీ పి.అరుణ్‌బాబు లేఖ రాశారు. విజయవాడలో ఇటువంటి ఘటనలు వెలుగుచూడటంతో తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.