విజయనగరం జిల్లాలో వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్
రిపోర్టర్: వెంకట్
స్థలం: విజయనగరం
విజయనగరం జిల్లా శాసనాపల్లి మరియు పెదవేమలి వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టడం సంతోషంగా ఉందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. రూ. 6.12 కోట్లతో నిర్మించనున్న ఈ వంతెనకు ఆయన ఆదివారం శంకుస్థాపన చేశారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు దశాబ్దాల వంతెన కలను నిజం చేసినట్లు మంత్రి తెలిపారు. ఈ వంతెన నిర్మాణంతో గంట్యాడ మరియు భీమసింగి మధ్య దూరం తగ్గి ప్రయాణ సౌలభ్యం ఎంతో మెరుగుపడుతుందని ఆయన స్పష్టం చేశారు.