పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ జాబ్ మేళా నిర్వహణ
రిపోర్టర్: సతీష్
స్థలం: పశ్చిమ గోదావరి
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని బి.ఆర్.ఆర్ మరియు జి.కె.ఆర్ ఛాంబర్స్ డిగ్రీ కళాశాలలో సెప్టెంబర్ 26వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పశ్చిమ గోదావరి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ ఉద్యోగ మేళాలో ఇరవైకి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయని తెలిపారు. ఎస్.ఎస్.సి నుండి పి.జి వరకు అర్హత కలిగిన నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.