విశ్రాంత ఉద్యోగుల సేవలను కొనియాడిన నేత

రిపోర్టర్: మదన్ రాయల్ స్థలం: తిరుపతి అర్బన్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం సమావేశంలో తిరుపతి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ జేబీ శ్రీనివాస్ పాల్గొన్నారు. సంఘం రాష్ట్ర కార్యదర్శులుగా ఎన్నికైన టి.గోపాల్, కెఆర్ శంకర్ లను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముప్పై ఏళ్ల పాటు వ్యవస్థను నడిపిన విశ్రాంత ఉద్యోగుల కష్టాలను పరిష్కరించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని భరోసా ఇచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.