కృష్ణా నదిపై లగ్జరీ హౌస్ బోట్లు పార్టీ క్రూజ్ లీజుకు గ్రీన్ సిగ్నల్
రిపోర్టర్: రమేష్
స్థలం: అమరావతి
కృష్ణా నదిలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నదిపై లగ్జరీ హౌస్‌బోట్, పార్టీ, డిన్నర్ క్రూజ్‌ల నిర్వహణకు ఒక ప్రైవేట్ సంస్థకు అనుమతులు మంజూరు చేసినట్లు అధికారులు తెలిపారు. ముప్పై కోట్ల రూపాయల వ్యయంతో చేపడుతున్న ఈ నూతన ప్రాజెక్టు ద్వారా పడవలోనే హోటల్ సౌకర్యాలు, విందులు, వినోదాలు అందుబాటులోకి రానున్నాయని, నాలుగైదు నెలల్లో ఈ బోట్లు పర్యాటకులకు సేవలందిస్తాయని వెల్లడించారు.