నారాయణపూర్లో సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం

రిపోర్టర్: KOLA MAHESH స్థలం: నారాయణపురం

మునుగోడు నియోజకవర్గంలో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాలు కొనసాగుతున్నాయి. నియోజకవర్గ వ్యాప్తంగా పేద ప్రజలకు నాణ్యమైన చూపు అందించే లక్ష్యంతో ఇప్పటివరకు పదహారు శిబిరాలు నిర్వహించి వేలాది మందికి పరీక్షలు, ఆపరేషన్లు పూర్తి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. రేపు నారాయణపురం మండల కేంద్రంలో పదిహేడో విడత ఉచిత కంటి వైద్య శిబిరం ఘనంగా నిర్వహించనున్నట్లు ఫౌండేషన్ ప్రతినిధులు వెల్లడించారు.