నూతన కమిటీ ఎన్నిక: తంజీమ్-ఎ-ఇన్సాఫ్ అధ్యక్షుడిగా షేక్ అక్రమ్ ఏకగ్రీవం
రిపోర్టర్: ఆముదాల వెంకన్న
స్థలం: ఖమ్మం
ఖమ్మం ఖానాపురం హవేలీ సీపీఐ కార్యాలయంలో తంజీమ్-ఎ-ఇన్సాఫ్ సమావేశం షేక్ రఫీ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మహమ్మద్ సలాం, జిల్లా అధ్యక్షులు సైదా హాజరయ్యారు. అనంతరం నూతన కమిటీని ఏర్పాటు చేసి అధ్యక్షుడిగా షేక్ అక్రమ్‌ను అందరూ కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.