కామారెడ్డిలో గణేష్ శోభాయాత్రను పరిశీలించిన జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: Kamareddy

కామారెడ్డిలో డప్పుల దరువులు, సంప్రదాయ నృత్యాల మధ్య వైభవంగా సాగుతున్న గణేష్ శోభాయాత్రను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర కాలినడకన పర్యటిస్తూ పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజలు మరియు గణేష్ మండపాల నిర్వాహకులతో ఆప్యాయంగా మాట్లాడుతూ, వారితో సెల్ఫీలు దిగుతూ ఆత్మీయతను చాటుకున్నట్లు ఎస్పీ కామారెడ్డి (@sp_kamareddy) ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు.