పాకిస్థాన్ కొత్త వైమానిక రక్షణ వ్యవస్థల ప్రదర్శన

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: India

భారత వైమానిక దాడులను సమర్థంగా తిప్పికొట్టేందుకు పాకిస్థాన్ వైమానిక దళం చైనా మరియు టర్కీ దేశాల నుంచి కొత్త రక్షణ ఆయుధాలను కొనుగోలు చేసింది. హెచ్‌క్యూ-17ఏ క్షిపణి వ్యవస్థలు మరియు కోర్కుట్ యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్ గన్‌లను ప్రదర్శించింది. అయితే బ్రహ్మోస్ వంటి సూపర్‌సోనిక్ క్షిపణుల ముందు ఇవి ఎంతవరకు నిలబడతాయనే దానిపై రక్షణ రంగ నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.