కాంగ్రెస్ నాయకులను రైతులు ఉరికించి కొడతారు కేటీఆర్ ఫైర్
రిపోర్టర్: నరేష్
స్థలం: Telangana
జూరాల ప్రాజెక్టులో నీళ్లు పుష్కలంగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీరు ఇవ్వకుండా రైతులను ఇబ్బంది పెడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ ఏడాది వచ్చిన రెండువందల నలభై ఎనిమిది టీఎంసీల కృష్ణా జలాల్లో తెలంగాణ కేవలం ఇరవై ఎనిమిది టీఎంసీలు మాత్రమే వాడిందని విమర్శించారు. పాలమూరు బిడ్డనని చెప్పుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇక్కడి రైతులకు తీవ్రద్రోహం చేస్తున్నారని ఆరోపించారు.