నేపాల్ లో భారీ హిమపాతం: చిక్కుకుపోయిన ఆరుగురు భారతీయ పర్యాటకులు
రిపోర్టర్: అశోక్
స్థలం: Nepal
నేపాల్ లోని షే-ఫోక్సుండో నేషనల్ పార్క్ ప్రాంతంలో శనివారం నుంచి భారీ హిమపాతం కారణంగా ఆరుగురు భారతీయ పర్యాటకులు చిక్కుకుపోయినట్లు డోల్పా చీఫ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ జును ధాకల్ వెల్లడించారు. పర్యాటకుల రక్షణ కోసం ప్రత్యేకంగా ఆర్మీ హెలికాప్టర్‌ను రప్పిస్తున్నామని, వారి ఆచూకీ కనుగొన్నామని ఆమె తెలిపారు. భద్రతా సిబ్బంది మరియు గైడ్ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ వారు సరస్సు ప్రాంతానికి వెళ్లడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు పేర్కొన్నారు.