అంతర్జాతీయ క్రికెట్ లో అఫ్గానిస్థాన్ అరుదైన ఘనత: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో ఆరో స్థానానికి ఎగబాకిన వైనం
రిపోర్టర్: నరేష్
స్థలం: తెలంగాణ
అంతర్జాతీయ క్రికెట్ మండలి తాజాగా విడుదల చేసిన పురుషుల వన్డే ర్యాంకింగ్స్ లో అఫ్గానిస్థాన్ జట్టు ఏకంగా ఆరో స్థానానికి ఎగబాకినట్లు ఐసీసీ అధికారులు వెల్లడించారు. మాజీ ప్రపంచ ఛాంపియన్ శ్రీలంకను వెనక్ కి నెట్టి తమ క్రికెట్ ప్రస్థానంలోనే ఆల్-టైమ్ బెస్ట్ ర్యాంకును సొంతం చేసుకున్నట్లు తెలిపారు. ఇంగ్లండ్, వెస్టిండీస్ వంటి దిగ్గజ జట్ల కంటే మెరుగైన స్థానాన్ని నిలబెట్టుకుంటూ అఫ్గాన్ జట్టు అసాధారణ ప్రగతిని కనబరుస్తోందని క్రీడా విశ్లేషకులు స్పష్టం చేశారు.