పర్యావరణ హితం కోరుతూ మట్టి వినాయక ప్రతిమల పంపిణీ
రిపోర్టర్: sankar p
స్థలం: మనుబోలు
నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు మండల పరిధిలోని తిరుమలమ్మపాలెం గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ కొరకై మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా అందజేశారు. జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచనల మేరకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొబ్బేపల్లి సురేష్ నాయుడు, ఏఎంసి డైరెక్టర్ వాణి భవాని నాయుడు ఈ కార్యక్రమం నిర్వహించారు. మట్టి బొమ్మలను వాడుదాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం అనే నినాదంతో ఈ కార్యక్రమం చేపట్టామని వారు తెలిపారు.