చంద్రగిరిలో చెవిరెడ్డికి షాకిచ్చిన సుధారెడ్డి: ఒకే కారులో వెళ్దామని సవాల్

రిపోర్టర్: రాజేష్ స్థలం: చంద్రగిరి

తిరుపతి జిల్లా చంద్రగిరిలో పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొన్న సమయంలో టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి నేరుగా రంగంలోకి దిగి వైఎస్సార్సీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నిలదీశారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఎన్నికలను ప్రశాంతంగా జరగనీయాలని, కావాలని కవ్వింపు చర్యలకు పాల్పడవద్దని ఆమె హితవు పలికారు. ఇద్దరం కలిసి ఒకే కారులో పోలింగ్ కేంద్రాలను పరిశీలిద్దాం రండంటూ సుధారెడ్డి విసిరిన సవాల్ తో చెవిరెడ్డి ఒక్కసారిగా కంగుతిన్నారని స్థానికులు పేర్కొన్నారు.