రేణిగుంట విమానాశ్రయంలో ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్
రిపోర్టర్: సురేష్
స్థలం: తిరుపతి
హైదరాబాద్కు బయలుదేరిన ఇండిగో విమానంలో టేకాఫ్ అయిన వెంటనే సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో అప్రమత్తమైన పైలట్ రేణిగుంట విమానాశ్రయంలో విమానాన్ని సురక్షితంగా అత్యవసర ల్యాండింగ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనతో విమానంలో ఉన్న నూట ఇరవై మంది ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అనంతరం ప్రయాణికులందరినీ వేర్వేరు విమానాల్లో సురక్షితంగా హైదరాబాద్కు తరలించినట్లు ఎయిర్పోర్ట్ వర్గాలు వెల్లడించాయి. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.