పొదలకూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అగ్నిప్రమాదం

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: Podalakur

సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు పట్టణంలోని బాలాజీనగర్‌లో ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆదివారం తెల్లవారుజామున విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో స్వల్ప అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో విద్యుత్ వైర్లు, ఇన్వర్టర్, బ్యాటరీ కాలిపోగా, స్థానికుల సమాచారంతో వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలనుార్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది. సబ్ రిజిస్ట్రార్ శోభమ్మ సంఘటనా స్థలాన్ని పరిశీలించి అధికారులకు నివేదించారు.