యరవరంలో ఈదురుగాలుల భారీ వర్షం నిలిచిన విద్యుత్
రిపోర్టర్: దొంతంశెట్టి సతీష్
స్థలం: ఏలేశ్వరం
బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో యర్రవరం పరిసర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. వాతావరణ పరిస్థితుల వల్ల ఉదయం నుంచే విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని, విద్యుత్ స్తంభాలు, తెగిన వైర్లకు దూరంగా ఉండాలని విద్యుత్ శాఖ అధికారులు సూచించారు. విద్యుత్ పునరుద్ధరణపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.