ధర్మవరంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిపై పోలీసులు కేసు నమోదు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: ధర్మవరం
శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సమయంలో జరిగిన ఘర్షణల నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారని అధికారులు తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించి అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించారనే ఆరోపణలతో ఈ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని కేతిరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.