కబడ్డీ క్రీడాకారులకు జెర్సీలను అందజేసిన మంత్రి పొన్నం ప్రభాకర్
రిపోర్టర్: Damidi Chandra Reddy
స్థలం: హుస్నాబాద్
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణ కేంద్రంలో గత పది రోజులుగా శిక్షణ పొందుతున్న సిద్దిపేట జిల్లా కబడ్డీ క్రీడాకారుల జట్టుకు మంగళవారం హుస్నాబాద్ ఎమ్మెల్యే, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా క్రీడాకారులకు జెర్సీలు అందజేశారు. రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలలో రాణించి సిద్దిపేట జిల్లా అలాగే తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని వారికి సూచించారు.