గూడూరు అభివృద్ధే ధ్యేయమన్న ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్

రిపోర్టర్: విజయ్ స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ స్పష్టం చేశారు. కూరగాయల మార్కెట్ పునరుద్ధరణ, సెంట్రల్ లైటింగ్, బ్రిడ్జి నిర్మాణం వంటి పలు అభివృద్ధి పనులను ప్రజల అవసరాలకు అనుగుణంగా చేపడుతున్నామని తెలిపారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఆయన పేర్కొన్నారు.